న్యూఢిల్లీ: కొందరు పిల్లలకు లెక్కలంటే భయం. దీనికి కారణం ఆ పిల్లల తల్లిదండ్రులేనని తాజా అధ్యయనం ఒకటి పేర్కొన్నది. లెక్కలు, అంకెలు.. అంటే తల్లిదండ్రులు భయపడితే, అయిష్టత చూపితే.. వారి పిల్లలు కూడా ప్రైమరీ, ప్రీ-ప్రైమరీ విద్యలో గణితం సబ్జెక్ట్‌లో వెనుకబడుతున్నారని పరిశోధకులు తెలిపారు.
గణితం పట్ల ఆసక్తికనబర్చే తల్లిదండ్రుల పిల్లల్లో ‘మ్యాథ్స్ యాైంగ్జెటీ’ లేదని అధ్యయనం తెలిపింది. లూఫ్బోర్ యూనివర్సిటీ (ఇంగ్లాండ్) పరిశోధకుల అధ్యయనం ప్రకారం, ‘మ్యాథ్స్ యాైంగ్జెటీ’ తీవ్రంగా ఉన్న 126 మంది తల్లిదండ్రులను, వారి పిల్లల గణిత నైపుణ్యాల్ని సైంటిస్టులు పరిశీలించారు. ఆన్లైన్ తరగతులతో పిల్లల తల్లిదండ్రులు తమ గణిత నైపుణ్యాల్ని పెంచుకోవాలని వారు సూచించారు.