PM Modi : ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ స్థానంలో ప్రధాని నరేంద్రమోదీ వరుసగా మూడోసారి విజయం సాధించారు. 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో కూడా ప్రధాని వారణాసి లోక్సభ స్థానం నుంచే గెలిచారు. ఈ ఎన్నికల్లో ప్రధాని 1,52,513 ఓట్ల మెజారిటీతో విజయాన్ని అందుకున్నారు.
వారణాసి నియోజకవర్గంలోని మొత్తం 11,27,081 ఓట్లకుగాను ప్రధాని మోదీకి 6,12,970 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ 4,60,457 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత బీఎస్పీ అభ్యర్థి అథేర్ జమాల్ లారీ కేవలం 33,766 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు.