Jagannath Rath Yatra | మరికాసేపట్లో జగన్నాథుని రథయాత్ర ప్రారంభం.. భక్తులతో కళకళలాడుతున్న ఆలయాలు.. Videos
Jagannath Rath Yatra | మరికాసేపట్లో దేశవ్యాప్తంగా జగన్నాథ రథయాత్ర ప్రారంభం కానుంది. పూరీ, అహ్మదాబాద్‌లలోని ప్రతిష్ఠాత్మకమైన ఆలయాలు సహా దేశంలోని అన్ని జగన్నాథ ఆలయాల నుంచి జగన్నాథుని రథం బయలుదేరనుంది.
న్యూఢిల్లీ: మరికాసేపట్లో దేశవ్యాప్తంగా జగన్నాథ రథయాత్ర ప్రారంభం కానుంది. పూరీ, అహ్మదాబాద్‌లలోని ప్రతిష్ఠాత్మకమైన ఆలయాలు సహా దేశంలోని అన్ని జగన్నాథ ఆలయాల నుంచి జగన్నాథుని రథం బయలుదేరనుంది. ఒడిశాలోని పూరీలో, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోగల జగన్నాథ స్వామి ఆలయాల్లో అంగరంగ వైభవంగా ఈ పవిత్రయాత్రను నిర్వహించనున్నారు. జగన్నాథ రథయాత్ర నేపథ్యంలో జగన్నాథుని ఆలయాలన్నీ ఇప్పటికే భక్తులతో కళకళలాడుతున్నాయి. రథయాత్ర మొదలయ్యే సమయానికి భక్తుల రద్దీ మరింత పెరుగనుంది.
హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో శుక్ల పక్షం రెండో రోజున జగన్నాథ రథయాత్ర జరుపుకుంటారు. పూరీలో జరిగే రథయాత్రకు దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. కాగా, హిందూ సనాతన ధర్మం ప్రకారం జగన్నాథుడు అంటే విశ్వమంతటికి నాథుడు లేదా ప్రపంచానికి ప్రభువు అని అర్థం. పూరీ నగరంలోని జగన్నాథుని తీర్థయాత్ర ఎంతో పవిత్రమైనది. ఈ పవిత్రమైన యాత్రలో బలరాముడు, తన సోదరి సుభద్ర కూడా ఉంటారు. జగన్నాథుని రథయాత్రలో పాల్గొనడంవల్ల అన్ని తీర్థయాత్రల చేసిన ఫలాలు లభిస్తాయని విశ్వాసం.
#WATCH | Gujarat: Lord Jagannath Rath Yatra 2023 to begin from Jagannath temple in Ahmedabad. Idols of lord Jagannath, Balabhadra and Subhadra being installed on the chariot pic.twitter.com/DsDhyNDx1U
— ANI (@ANI) June 20, 2023
#WATCH | Delhi: Celebrations of the 56th lord Jagannath Rath Yatra at Jagannath Mandir, Tyagraj Nagar. pic.twitter.com/SjbG7PuvMa
— ANI (@ANI) June 20, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

