ఉడుపి: నరుల ప్రాణాలు హరించే యమ ధర్మరాజు, మానవుల పాపపుణ్యాల చిట్టా రాసివుంచే చిత్రగుప్తుడు కాంగ్రెస్ పాలనలోని కర్ణాటకలో రోడ్ల పరిస్థితిని చెక్ చేసేందుకు భూమిపైకి వచ్చారు! రహదారుల దుస్థితిని తెలిపేందుకు ఉడుపిలో కొంత మంది వినూత్నంగా నిరసన చేపట్టారు. ప్రాణాంతకంగా తయారైన రోడ్లపై భారీగా ఏర్పడిన గుంతల వద్ద ‘దెయ్యాల’కు లాంగ్ జంప్ పోటీలు నిర్వహించారు. ఎంత దూరం దూకారో టేపులు పెట్టి కొలిచారు. ఈ వీడియోపై నెటిజన్లు పలు విధాలుగా స్పందించారు. రోడ్డు నిండా గుంతలు ఉండటంతో కొందరు ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ పోటీలు నిర్వహించారు.