న్యూఢిల్లీ: ప్రజాగ్రహం నేపథ్యంలో ఏడు ఖరీదైన బీఎండబ్ల్యూ కార్లను కొనుగోలు చేయడానికి ఇటీవల పిలిచిన టెండర్లను లోక్పాల్ రద్దు చేసింది. నవంబర్ 27న పూర్తి ధర్మాసనం చేసిన తీర్మానం మేరకు పరిపాలన పరమైన కారణాల వల్ల ఈ రద్దు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
దేశంలో అవినీతి నియంత్రణ కోసం ఏర్పాటైన లోక్పాల్ తమకు ఒక ఏడాదిలో కేటాయించిన మొత్తం బడ్జెట్లో 10 శాతాన్ని కేవలం ఖరీదైన వాహనాల కొనుగోలుకే ఖర్చు చేయాలని ప్రయత్నించడంపై ఆగ్రహం వ్యక్తమైంది. కిరణ్ బేడీ లాంటి ప్రముఖులు లోక్పాల్ నిర్ణయాన్ని విమర్శించారు.