బెళగావి : కర్ణాటకలో ముడా స్కామ్‌పై దాఖలైన 9 కేసులకు సంబంధించి మంగళవారం 40 చోట్ల లోకాయుక్త దాడులు చేసింది. బెళగావి, హవేరి, దావణగెరె, కలబురగి, మైసూరులోని పలు ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి. మరోవైపు ముడా ప్లాట్ల కేటాయింపును సీఎం సిద్ధరామయ్య ప్రభావితం చేశారని సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణ తీవ్ర ఆరోపణలు చేశారు.
సిద్ధరామయ్య భార్య తనకు కేటాయించిన ముడా ప్లాట్ కొనుగోలు ఒప్పంద పత్రానికి రుసుమును చెల్లించలేదని ఆయన ఆరోపించారు. ముడా తహసిల్దారే స్టాంప్ డ్యూటీ చెల్లించారని చెప్పారు. లోకాయుక్త దర్యాప్తు విశ్వసనీయతపై కేంద్ర మంత్రి కుమారస్వామి సందేహం వ్యక్తం చేశారు.