న్యూఢిల్లీ: లోక్‌సభ(Loksabha) ఇవాళ నిరవధిక వాయిదా పడింది. విపక్ష సభ్యుల ఆందోళన నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఆ సమయంలో ప్రధాని మోదీ సభలో ఉన్నారు. మరో వైపు ఇవాళ ఉదయం పార్లమెంట్ ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద .. ఇండియా కూటమి ఎంపీలు నిరసన చేపట్టారు. అంబేద్కర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఇండియా కూటమి నేతలు తప్పుపట్టారు. షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్‌ను అవమానించిన షా రాజీనామా చేయాలని ఇవాళ విజయ్ చౌక్ వద్ద విపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. జమిలి ఎన్నికల బిల్లును జేపీసీకి లోక్‌సభ రిఫర్ చేసింది. మరో వైపు విపక్ష సభ్యుల ఆందోళన నేపథ్యంలో రాజ్యసభను 12 గంటల వరకు వాయిదా వేశారు.
#WATCH | Delhi | After meeting two injured BJP MPs in RML hospital, Union Minister Shivraj Singh Chouhan says, “…It is in Congress’s DNA to insult democracy… In 1975, Indira ji strangled democracy, today Rahul Gandhi is taking forward that legacy. These people who are full of… pic.twitter.com/QjGqrM18Tw
— ANI (@ANI) December 20, 2024
జమిలి ఎన్నికల ముసాయిదాను జేపీసీకి పంపాలన్న తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని స్పీకర్ బిర్లా.. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ను కోరారు. మరో వైపు సభలో విపక్షాలు జైభీం అంటూ కేకలు పెట్టారు. పార్లమెంట్ గేటు వద్ద ఆందోళనలు, నిరసనలు చేపట్టరాదు అని స్పీకర్ బిర్లా ఆదేశించారు. విపక్ష సభ్యుల ఆందోళనల నేపథ్యంలో స్పీకర్ సభను నిరవధిక వాయిదా వేశారు.