Lok Sabha Elections | ఆరో దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ షురూ.. ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకు కూడా..
Lok Sabha Elections | లోక్‌సభ ఎన్నికల ప్రక్రియలో ఇవాళ ఆరో విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. దేశంలోని 6 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్‌సభ నియోజకవర్గాల్లో శనివారం పోలింగ్ జరుగుతున్నది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్ర 5 గంటల వరకు కొనసాగనుంది. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది.
Lok Sabha Elections : లోక్‌సభ ఎన్నికల ప్రక్రియలో ఇవాళ ఆరో విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. దేశంలోని 6 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్‌సభ నియోజకవర్గాల్లో శనివారం పోలింగ్ జరుగుతున్నది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్ర 5 గంటల వరకు కొనసాగనుంది. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. ఉదయం పోలింగ్ ప్రారంభానికి ముందే ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరారు.
ఇప్పటికే ఐదు విడతల పోలింగ్ ముగిసిపోగా ఇప్పుడు ఆరో విడత పోలింగ్ జరుగుతోంది. జూన్ 1న జరిగే చివరి విడతతో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగియనుంది. జూన్ 4న ఒకేసారి ఓట్లను లెక్కించి ఫలితాలు విడుదల చేయనున్నారు. ఆరో విడత పోలింగ్ జరగనున్న రాష్ట్రాల జాబితాలో బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాలు ఉన్నాయి. బీహార్‌లో 8, హరియాణాలో 10, జమ్ముకశ్మీర్‌లో 1, జార్ఖండ్‌లో 4, ఢిల్లీలో 7, ఒడిశాలో 6, యూపీలో 14, బెంగాల్లో 8 స్థానాల్లో పోలింగ్ జరగనుంది.
జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్‌లో మూడో విడతలోనే పోలింగ్ జరగాల్సి ఉండగా వాయిదా పడింది. ఆరో విడతలో ఆ లోక్‌సభ స్థానానికి పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఆరో విడతలో వివిధ పార్టీల నుంచి కీలక అభ్యర్థులు బరిలో దిగుతున్నారు. ఢిల్లీలో 7 లోక్‌సభ స్థానాలకు ఆరో విడత ఎన్నికల్లోనే పోలింగ్ జరగనుంది. లిక్కర్ స్కామ్ కేసు, స్వాతి మాలివాల్‌పై దాడి లాంటి పరిణామాలు అక్కడి రాజకీయాలను వేడెక్కించాయి. దాంతో ఆరో విడత లోక్‌సభ ఎన్నికలపై ఎప్పుడూ లేనంతగా ఉత్కంఠ నెలకొంది.
న్యూఢిల్లీ నుంచి కేంద్ర మాజీ మంత్రి, దివంగత సుష్మా స్వరాజ్ కూతురు బన్సూరి స్వరాజ్ బీజేపీ తరపున బరిలోకి దిగుతున్నారు. ఆమె ఆప్ అభ్యర్థి సోమ్‌నాథ్ భారతితో తలపడనున్నారు. ఈశాన్య ఢిల్లీలో ఈసారి టఫ్ ఫైట్ కనిపించేలా ఉంది. కాంగ్రెస్ తరపున కన్హయ్య కుమార్ బరిలోకి దిగగా, బీజేపీ తరపున సిట్టింగ్ ఎంపీ మనోజ్ తివారీ పోటీ చేస్తున్నారు. యూపీలోని సుల్తాన్‌పూర్‌లో బీజేపీ తరపున మేనకాగాంధీ బరిలోకి దిగారు. సమాజ్‌వాది పార్టీ నుంచి రామ్ బువల్ నిషద్ బరిలో ఉన్నారు.
ఇక యూపీలోనే మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సోదరుడు ధర్మేంద్ర యాదవ్ ఆజాంగఢ్ నుంచి బరిలోకి దిగారు. 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచే బరిలోకి దిగిన అఖిలేష్ యాదవ్ విజయం సాధించారు. ఈ సారి కూడా తమ పార్టీ అభ్యర్థి గెలుస్తాడన్న నమ్మకంతో ఉన్నారు. ఒడిశాలోని పూరి నియోజకవర్గంలో బీజేపీ తరపున సంబిత్ పాత్ర పోటీ చేస్తున్నారు. ఇక్కడ బీజేడీ తరపున అరుప్ పట్నాయక్, కాంగ్రెస్ నుంచి జయ్ నారాయణ్ పట్నాయక్ బరిలో ఉన్నారు.
హర్యానాలోని కురుక్షేత్రలో బీజేపీ తరపున నవీన్ జిందాల్ బరిలో ఉన్నారు. కర్నాల్ నియోజకవర్గం నుంచి హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పోటీ చేస్తున్నారు. గుడ్గావ్లో కాంగ్రెస్ తరపున రాజ్ బబ్బర్.. బీజేపీ సిట్టింగ్ ఎంపీ ఇంద్రజిత్ సింగ్‌తో తలపడుతున్నారు. ఒడిశాలోని 42 అసెంబ్లీ స్థానాలకు కూడా లోక్‌సభ ఆరో విడత ఎన్నికలతోపాటే పోలింగ్ జరుగుతోంది.
#WATCH | #LokSabhaElection2024 | People queue up outside a polling booth in Ranchi to cast their votes; voting will begin at 7 am
Jharkhand’s 4 constituencies will undergo polling in the 6th phase of the 2024 general elections. pic.twitter.com/nPm398UfeM
— ANI (@ANI) May 25, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

