Lok Sabha Elections : దేశవ్యాప్తంగా ఐదో దశ ఎన్నికల్లో భాగంగా 8 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్‌సభ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. ఉదయం నుంచి ఓటర్లు బారులుతీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. దాంతో సాయంత్రం 5 గంటల వరకు సగటున 56.68 శాతం పోలింగ్ నమోదైంది. పశ్చిమబెంగాల్లో రికార్డు స్థాయిలో 73 శాతం పోలింగ్ జరిగింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం డాటాను షేర్ చేసింది.
ఎన్నికల సంఘం డాటా ప్రకారం.. పశ్చిమబెంగాల్లో 73 శాతం, లఢక్‌లో 67.15 శాతం, జార్ఖండ్‌లో 61.90 శాతం, ఒడిశాలో 60.55 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 55.80 శాతం, జమ్ముకశ్మీర్‌లో 54.21 శాతం, బీహార్‌లో 52.35 శాతం, మహారాష్ట్రలో అత్యల్పంగా 48.66 శాతం పోలింగ్ నమోదైంది. ముంబైలో ఉదయం నుంచి కూడా పోలింగ్ నిరాశాజనకంగానే సాగుతున్నది.
అక్కడ సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ 50 శాతానికి మించలేదు. ముంబై నార్త్‌లో 46.91 శాతం, ముంబై నార్త్ సెంట్రల్లో 47.32 శాతం, ముంబై నార్త్ ఈస్ట్ 48.67 శాతం, ముంబై నార్త్ వెస్ట్ 49.79 శాతం, ముంబై సౌత్‌లో అత్యల్పంగా 44.22 శాతం, ముంబై సౌత్ సెంట్రల్లో 48.26 శాతం పోలింగ్ నమోదైంది.