HomeNationalLok Sabha Elections 2024 Pm Modi Says Indi Alliance Has Diseases Worse Than Cancer
ఫ్రస్ట్రేషన్లో బీజేపీ!
‘విపక్ష ఇండియా కూటమికి క్యాన్సర్ కంటే ప్రమాదకరమైన మూడు వ్యాధులు ఉన్నాయి. అవి మతతత్వం, జాత్యహంకారం, బంధుప్రీతి. వారి విస్తరణ జరిగితే దేశం మొత్తాన్ని నాశనం చేస్తారు. 60 ఏండ్లలో ఏం చేయని విపక్షం.. ఇప్పుడు ప్రధాని మోదీని, అతని పనిని అడ్డుకొనేందుకు ఏకం అయ్యాయి.
క్యాన్సర్ కంటే ప్రమాదకర వ్యాధులు
‘విపక్ష ఇండియా కూటమికి క్యాన్సర్ కంటే ప్రమాదకరమైన మూడు వ్యాధులు ఉన్నాయి. అవి మతతత్వం, జాత్యహంకారం, బంధుప్రీతి. వారి విస్తరణ జరిగితే దేశం మొత్తాన్ని నాశనం చేస్తారు. 60 ఏండ్లలో ఏం చేయని విపక్షం.. ఇప్పుడు ప్రధాని మోదీని, అతని పనిని అడ్డుకొనేందుకు ఏకం అయ్యాయి. యూపీలో ఇద్దరు బాలురి(కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్‌లను ఉద్దేశించి) ఫ్లాప్ సినిమాను తిరిగి లాంచ్ చేశారు. ఈ ఇద్దరు యువ రాజులు మోదీ చేసిన పనులను రద్దు చేస్తారు’
-బుధవారం యూపీలోని శ్రావస్థిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ
30 సీట్లు గెలిస్తే.. టీఎంసీ విచ్ఛిన్నం
‘పశ్చిమబెంగాల్లో 42 సీట్లకు బీజేపీ 30 స్థానాలను గెలుచుకొంటే.. రాష్ట్రంలోని అధికార టీఎంసీ విచ్ఛిన్నం అవుతుంది. మమతా బెనర్జీ ప్రభుత్వం నిష్క్రమించడం ఖాయం. మమత ప్రభుత్వంలో రాష్ట్రం చొరబాటుదారులకు స్వర్గధామంగా మారిం ది. ఈ చొరబాటుదారుల అంశం ఒక్క బెంగాల్‌కే కాకుండా దేశానికి ఆందోళనకరం. మమత తన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దేశ భద్రతను పణంగా పెడుతున్నారు. అదే విధంగా రాష్ట్రంలో ఎన్నికల హింస ప్రజాస్వామ్యాన్ని బలహీనం చేసింది’
– బుధవారం పుర్భ మేదినిపూర్ జిల్లాలో జరిగిన సభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా