ధరల పెరుగుదలపై చర్చకు బీఏసీ ఓకే..
న్యూఢిల్లీ : దేశంలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై చర్చకు లోక్సభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ అంగీకరించింది. లోక్సభలో రూల్ 193 ప్రకారం ఈ వారంలో చర్చ జరుగనున్నది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా రాజకీయ పార్టీల సభ్యులతో కూడిన బిజినెస్ అడ్వైజరీ కమిటీకి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ సభలో చర్చకు తీసుకోవాల్సిన అంశాలను చర్చించి నిర్ణయం తీసుకుంటుంది. అయితే, ఇంధన ధరల పెంపు అంశంపై లోక్సభ, రాజ్యసభలో చర్చ జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై ప్రతిపక్షాలు నిరసన తెలుపగా.. సోమవారం రాజ్యసభ మధ్యాహ్నానికి వాయిదా పడింది. 15 మంది సభ్యుల బిజినెస్ అడ్వైజరీ సలహా కమిటీలో సుదీప్ బందోపాధ్యాయ, పీపీ చౌదరి, అధిర్ రంజన్ చౌదరి, సంజయ్ జైస్వాల్, పినాకి మిశ్రా ఉన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండో విడుత ఈ నెల 14న ప్రారంభం కాగా.. వచ్చే 8వ తేదీతో ముగియనున్నాయి. మొదటి విడుతలో జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 11వ తేదీ వరకు జరిగాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

