పార్లమెంట్ ఉభయసభలు రేపటికి వాయిదా
Parliament adjourned | అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌లో అవినీతి, అక్రమాలపై చర్చ జరుపాలంటూ ప్రతిపక్షాలు చేపట్టిన ఆందోళనలతో పార్లమెంట్ ఉభయసభలు దద్దరిల్లాయి.
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌లో అవినీతి, అక్రమాలపై చర్చ జరుపాలంటూ ప్రతిపక్షాలు చేపట్టిన ఆందోళనలతో పార్లమెంట్ ఉభయసభలు దద్దరిల్లాయి. అదానీ గ్రూప్‌లో అవకతవకలను వెలికితీయడానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటు చేయాలని ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టారు. కానీ, లోక్‌సభలో స్పీకర్‌గానీ, రాజ్యసభలో చైర్మన్‌గానీ వారి డిమాండ్స్‌ను అంగీకరించలేదు.
దాంతో ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. లోక్‌సభలో స్పీకర్ పోడియంలోకి, రాజ్యసభలో వెల్‌లోకి దూసుకెళ్లి ఎంపీలు ఆందోళనకు దిగారు. ఇలా పోడియంలోకి దూసుకొచ్చి ఆందోళన చేయడం భారతీయ సాంప్రదాయం కాదని స్పీకర్ ఓంబిర్లా వారించినా సభ్యులు వినిపించుకోలేదు. అటు రాజ్యసభ కూడా విపక్ష సభ్యుల నినాదాలదో మార్మోగింది.
ఈ క్రమంలో పార్లమెంటు ఉభయసభలు మధ్యాహ్నం 2.00 గంటల వరకు వాయిదాపడ్డాయి. వాయిదా అనంతరం సభలు ప్రారంభమైనప్పటికీ సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. లోక్‌సభలో, రాజ్యసభలో ప్రతిపక్ష ఎంపీల నినాదాల జోరు కొనసాగింది. రాజ్యసభలో ఎవరి స్థానాల్లోకి వాళ్లు వెళ్లాలంటూ చైర్మన్ ధన్కడ్ చేసిన విజ్ఞప్తిని ఎవరూ లెక్కచేయలేదు. దాంతో ఉభయసభలు రేపటికి వాయిదాపడ్డాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

