Sunetra Pawar Assets | మహారాష్ట్రలోని బారామతి లోక్‌సభా నియోజకవర్గం మరాఠా నేత శరద్ పవార్ కుటుంబ సభ్యుల మధ్య పోరుకు కేంద్రమైంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ (శరద్ పవార్) పార్టీ నుంచి శరద్ పవార్ తనయ సుప్రియా సూలే నాలుగో దఫా పోటీ చేస్తుండగా, ఆమెపై ఎన్డీఏ కూటమి మద్దతుతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సుప్రియా సూలే వదిన, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ పోటీ చేస్తున్నారు. ఈ మేరకు వీరిద్దరూ గురువారం నామినేషన్లు దాఖలు చేశారు. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ ఆస్తులు, అప్పుల వివరాలను అఫిడవిట్ లో తెలియజేయాల్సి ఉంటుంది. సునేత్ర పవార్ దాఖలు చేసిన అఫిడవిట్లో సంచలన విషయాలు బయట పడ్డాయి. సునేత్ర పవార్ తన భర్త అజిత్ పవార్ మాత్రమే కాదు.. అత్తగారు (శరద్ పవార్ భార్య) ప్రతిభా పవార్, సుప్రియా సూలేకూ రుణాలిచ్చారు. మొత్తం రూ.2 కోట్ల రుణాలిచ్చారు సునేత్ర పవార్.
మొత్తం సునేత్ర పవార్ ఆస్తుల విలువ రూ.71 కోట్లు. వాటిల్లో చర, స్థిరాస్తుల విలువ రూ.20.95 లక్షల పై చిలుకు. వీటిలో వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములు ఉన్నాయి. సుప్రియా సూలే ఆస్తులతో పోలిస్తే సునేత్ర పవార్ ఆస్తులే ఎక్కువ.. సుప్రియా సూలే ఆస్తుల విలువ సుమారు రూ.48 కోట్లు.
ప్రతిభా పవార్ : రూ.50 లక్షలు
అజిత్ పవార్ : రూ.63 లక్షలు
సుప్రియా సూలే : రూ.35 లక్షలు.
బ్యాంకు డిపాజిట్లు రూ.2.97 కోట్లు
షేర్లలో పెట్టుబడులు : రూ.15.89 లక్షలు
ట్రాక్టర్, రెండు ట్రెయిలర్లు : రూ.10.70 లక్షలు
35 కిలోల వెండి: రూ.24.99 లక్షలు
1.30 కిలోల బంగారం: రూ.51.84 లక్షలు
వజ్రాభరణాలు: రూ.24 లక్షలు.
స్థిరాస్తులు: రూ. 20,95,98,000