న్యూఢిల్లీ: ఒక చిన్న బాలుడు చేతి పంపు ద్వారా కుక్క పిల్ల దాహం తీర్చాడు. ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా ఒక వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇందులో ఒక బుడ్డోడు తన బలమంతా ఉపయోగించి చేతి పంపును కొట్టి కుక్కపిల్ల దాహం తీరుస్తాడు. ‘చిన్నవారా, పెద్ద వారా అన్నది కాదు.. ఎవరైనా ఎవరికైనా వీలైనంత సహాయం చేయగలరు. వెల్డన్ కిడ్. గాడ్ బ్లెస్’ యూ అని అందులో పేర్కొన్నారు.
కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కుక్క పిల్ల దాహం తీర్చేందుకు చిన్న బాలుడు చేసిన పనిని నెటిజన్లు ఎంతో మెచ్చుకున్నారు. ప్రపంచం మొత్తం ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నానని ఒకరు, ‘మానవత్వం ఎప్పుడూ వయస్సు, ఎత్తు, జ్ఞానం చూడదు. ఇతరులకు సహాయం చేయడం అంతర్గత హృదయం నుండి వస్తుంది’ అని మరొకరు పేర్కొన్నారు.
‘స్వచ్ఛమైన ప్రేమ.. అమాయకత్వం’ అని ఒకరు ప్రశంసించారు. ‘మీరు పిల్లలకి జంతువుల పట్ల ప్రేమను నేర్పినప్పుడు, అది ఇద్దరికీ ప్రయోజనం చేకూరుస్తుంది’ అని మరొకరు వ్యాఖ్యానించారు.
कद कितना ही छोटा हो, हर कोई किसी की यथासंभव #Help कर सकता है.
— Dipanshu Kabra (@ipskabra) December 7, 2021
Well done kid. God Bless you.
VC- Social Media.#HelpChain #Kindness #BeingKind pic.twitter.com/yQu4k5jyh1