న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా చలిపులి పంజా విసురుతుంటే శీతల గాలులకు ప్రజలు నిలువునా వణుకుతున్నారు. చలిగాలుల తీవ్రతతో బిక్కుబిక్కుమంటున్న మేకకు ఓ బాలుడు చలిమంటతో ఆసరాగా నిలిచిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ట్విట్టర్లో ఈ వీడియోను షేర్ చేయగా ఇప్పటివరకూ 15,000 మందికిపైగా వీక్షించారు.
ठंड सबको लगती है 🥺❤️ pic.twitter.com/2mwYSWJwVh
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) December 4, 2022
మేక పట్ల చిన్నారి చూపిన ఆదరణకు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఈ వీడియోలో మంట వద్ద బాలుడు కూర్చుండగా అతడి తొడభాగంలో మేకను కూర్చోపెట్టుకున్నాడు. చలి పులి నుంచి మేకను రక్షించేందుకు ప్రయత్నిస్తున్న బాలుడిపై నెటిజన్లు ప్రశంసలు గుప్పించారు.