వారణాసి : ఓ వైపు పెట్రో ధరలు మండిపోతున్నాయి. మరో వైపు నిమ్మకాయల ధరలు కూడా ఆకాశన్నంటాయి. ఈ రెండింటిని సామాన్యుడు కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఓ మొబైల్ షాపు నిర్వాహకుడు కస్టమర్లను ఆకర్షించేందుకు వినూత్నంగా ఆలోచించాడు. తన దుకాణంలో మొబైల్ కొంటే ఉచితంగా నిమ్మకాయలు, లీటర్ పెట్రోల్ ఉచితంగా ఇస్తానని పోస్టర్లు ఏర్పాటు చేసి, కస్టమర్లను ఆకర్షిస్తున్నాడు. ఇది ఎక్కడంటే.. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో.
రూ. 10 వేల విలువ చేసే మొబైల్ ఫోన్ కొనుగోలు చేస్తే.. లీటర్ పెట్రోల్ ఉచితంగా ఇస్తానని పేర్కొన్నారు. మొబైల్ యాక్సెసరీస్ కొన్న వారికి 2 నుంచి 4 నిమ్మకాయలు ఉచితంగా ఇస్తానని స్పష్టం చేశాడు ఆ షాపు నిర్వాహకుడు. గత కొద్ది వారాల నుంచి పెట్రోల్‌తో పాటు నిమ్మకాయల ధరలు అమాంతం పెరిగిన సంగతి తెలిసిందే.
#Varanasi: Amid rising prices, this electronics store has unique offers – 1 liter #petrol free on mobiles above Rs 10,000 and free #lemon with smartphone accessories
Track udpates – https://t.co/xOCQbrIyex pic.twitter.com/qaxs20XJ9F
— Hindustan Times (@htTweets) April 21, 2022