Liquor Scam | ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ను ఈడీ రోస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. సంజయ్ సింగ్కు ఐదురోజుల కస్టడీకి ఇవ్వాలని కోరగా.. కోర్టు మూడురోజులు రిమాండ్కు ఇస్తూ ఉత్తర్వులు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 13 వరకు ఆప్ నేత ఈడీ రిమాండ్లోను ఉండనున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో లంచం డిమాండ్ చేసినట్లు ఆధారాలు ఉన్నాయని ఈడీ తెలిపింది. మద్యం పాలసీ కేసులో ఈ నెల 4న ఈడీ అరెస్టు చేసిన విషయం విధితమే. దాదాపు పదిగంటలకుపైగా ఇంట్లో సోదాలు నిర్వహించిన తర్వాత ఆయనను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచింది. ఆ తర్వాత ఈ నెల 10 వరకు ఈడీ కస్టడీకి ఇచ్చింది. మరో వైపు సంజయ్ సింగ్ను కోర్టులో హాజరుపరిచిన సమయంలో ఆయన మద్దతుదారులు వేలాది మంది కోర్టు ఆవరణలో నిరసన చేపట్టారు.