న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్’ (ఐఐఎఫ్‌టీ) ప్రపంచస్థాయి బెస్ట్ బిజినెస్ స్కూల్లో చోటు దక్కించుకుంది. ఈ ఏడాది లింక్డిన్ టాప్-100 ఎంబీఏ ప్రోగామ్స్ నెట్వర్కింగ్ క్యాటగిరీలో ప్రపంచంలోనే ఐఐఎఫ్‌టీ టాప్‌లో నిలిచింది.
టాప్-100 ఎంబీఏ ప్రోగ్రామ్స్‌లో 51వ ర్యాంక్‌ను సాధించింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈమేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో ఐఐఎఫ్‌టీ టాప్‌లో నిలవటంపై కేంద్ర మంత్రి పియూష్ గోయల్ హర్షం వ్యక్తం చేశారు. అకడమిక్స్, రిసెర్చ్‌లో సంస్థ నిరంతర ప్రయత్నాలకు తాజా ఫలితమే నిదర్శనమని ఐఐఎఫ్‌టీ వీసీ రాకేశ్ మోహన్ చెప్పారు.