ఆదివారం 29 నవంబర్ 2020
National - Nov 21, 2020 , 07:51:53

కేంద్ర విద్యాశాఖ మంత్రికి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు‌

కేంద్ర విద్యాశాఖ మంత్రికి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు‌

న్యూఢిల్లీ: కేంద్ర విద్యాశాఖ మంత్రి ర‌మేశ్ పోఖ్రియాల్ ఇవాళ వాతాయ‌న్‌ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకోనున్నారు. గంగాన‌ది, హిమాల‌యాలు, ప‌ర్యావ‌ర‌ణంపై ఆయ‌న ర‌చ‌న‌ల‌కు గాను లండ‌న్‌కు చెందిన వాతాయ‌న్ యూకే సంస్థ ఈ పుర‌స్కారాన్ని అందిస్తున్న‌ది. ఇవాళ లండ‌న్‌లో జ‌రుగున్న కార్య‌క్ర‌మంలో ఆయ‌న అవార్డును అందుకుంటారు. ఇప్ప‌టివ‌రకు 75కుపైగా పుస్త‌కాలు రాసిన మంత్రి అనేక అవార్డులు అందుకున్నారు. మాజీ ప్ర‌ధాని వాజపేయి నుంచి సాహిత్య భార‌తి అవార్డును, మాజీ రాష్ట్ర‌ప‌తి అబ్దుల్ క‌లాం నుంచి భార‌త్ గౌర‌వ్ స‌మ్మాన్, మారిష‌స్, ఉగాండా, నేపాల్‌, థాయ్‌లాండ్, భూటాన్ ప్ర‌భుత్వాల నుంచి సాహిత్య పుర‌స్కార‌ల‌ను అందుకున్నారు.