LIC shares | వాటా విక్రయించాలని కేంద్రం నిర్ణయం.. ఎల్ఐసీ షేర్లు భారీగా పతనం..!
LIC shares | భారత జీవిత బీమా సంస్థ (LIC) లో తన వాటాను తగ్గించుకోనున్నట్లు కేంద్ర ప్రభుత్వం (Union Govt) ప్రకటించింది. దాంతో సంస్థ షేర్లు మంగళవారం భారీగా పతనమయ్యాయి. ట్రేడింగ్ (Trading) ప్రారంభమైన కొద్దిసేపటికే ఎల్ఐసీ షేరు దాదాపు ఎనిమిది శాతం వరకు పడిపోయింది. ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా ఎల్ఐసీలో 6.5 శాతం వరకు వాటాను విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది.
LIC shares : భారత జీవిత బీమా సంస్థ (LIC) లో తన వాటాను తగ్గించుకోనున్నట్లు కేంద్ర ప్రభుత్వం (Union Govt) ప్రకటించింది. దాంతో సంస్థ షేర్లు మంగళవారం భారీగా పతనమయ్యాయి. ట్రేడింగ్ (Trading) ప్రారంభమైన కొద్దిసేపటికే ఎల్ఐసీ షేరు దాదాపు ఎనిమిది శాతం వరకు పడిపోయింది. ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా ఎల్ఐసీలో 6.5 శాతం వరకు వాటాను విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది.
ఇందులో 2.5 శాతం ప్రాథమిక ఆఫర్ ఉండగా.. మరో 4 శాతం వరకు గ్రీన్‌షూ ఆప్షన్ కూడా ఉంది. ఈ విక్రయం పూర్తయితే కేంద్రానికి సుమారు రూ.31 వేల కోట్లు సమకూరే అవకాశం ఉంది. ఓఎఫ్‌ఎస్‌కు ఒక్కో షేరు కనిష్ఠ ధరను రూ.382 గా నిర్ణయించారు. ఇది సోమవారం ముగింపు ధర కంటే దాదాపు 11 శాతం తక్కువ. దాంతో మార్కెట్లో భారీ అమ్మకాల ఒత్తిడి ఏర్పడి షేరు ధర క్షీణించింది. ఉదయం ట్రేడింగ్‌లో షేరు రూ.390.70 కనిష్ఠ స్థాయికి చేరింది.
మంగళవారం నుంచి సంస్థాగత మదుపర్లకు ఓఎఫ్ఎస్ అందుబాటులోకి వచ్చింది. బుధవారం నుంచి రిటైల్ మదుపర్లు కూడా ఇందులో పాల్గొనవచ్చు. ప్రస్తుతం ఎల్ఐసీలో కేంద్ర ప్రభుత్వానికి 96.5 శాతం వాటా ఉంది. ప్రజల వద్ద కేవలం 3.5 శాతం మాత్రమే ఉంది. ఈ ఓఎఫ్ఎస్ పూర్తయితే ప్రభుత్వ వాటా 90 శాతానికి తగ్గుతుంది. కనీస ప్రజా వాటా నిబంధనలు పాటించేందుకు 2027 మే వరకు గడువు ఇచ్చిన సెబీ ఆదేశాలకు అనుగుణంగానే ఈ చర్య చేపట్టింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- LIC shares
- ofs
- trading
- Union Govt
RELATED ARTICLES
తాజా వార్తలు
Laxma Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్లే రైతాంగానికి తీరని నష్టం : మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
Manchu Manoj | రాప్తాడు ఘటనపై మంచు మనోజ్ రియాక్షన్.. మహిళల గౌరవం ఇంటి నుంచే మొదలవ్వాలంటూ పిలుపు!
Vande Bharat Sleeper Train | పట్టాలెక్కిన బెంగళూరు-ముంబై వందే భారత్ స్లీపర్ రైలు.. ప్రారంభించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
Kangana Ravi Babu | కంగనా రనౌత్‌తో రవిబాబు హారర్ సినిమా.. నిర్మాతగా రానా దగ్గుబాటి, టైటిల్ ఏంటంటే..!
KTR | రైతుల బతుకులను నాశనం చేస్తున్న రేవంత్‌రెడ్డి : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

