న్యూఢిల్లీ, జనవరి 16: భారతదేశం సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్నవేళ అమెరికాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ సంస్థ ఓపెన్ ఏఐ కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ ప్రచారానికి, ఎన్నికల్లో లాబీయింగ్‌కు తమ ఏఐ (కృత్రిమ మేధ)ను ఉపయోగించుకునేందుకు అనుమతించబోమని స్పష్టం చేసింది.