కోల్‌కతాలో సంప్రదాయబద్ధంగా ఒక్కటైన లెస్బియన్ జంట
ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీలో ఆశలు రేకెత్తించేలా సంప్రదాయబద్ధంగా జరిగిన వేడుకలో కోల్‌కతాకు చెందిన ఓ లెస్బియన్ జంట ఒక్కటైంది.
కోల్‌కతా : ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీలో ఆశలు రేకెత్తించేలా సంప్రదాయబద్ధంగా జరిగిన వేడుకలో కోల్‌కతాకు చెందిన ఓ లెస్బియన్ జంట ఒక్కటైంది. హల్దీ, సంగీత్, మెహందీ వంటి వేడుకలు పూర్తయిన అనంతరం వారు దండలు మార్చుకుని దంపతులయ్యారు. చైతన్య శర్మ, అభిషేక్ రే ఇటీవల వైవాహిక బంధంతో ఒక్కటి కాగా తాజాగా నగరానికి చెందిన మౌసమి దత్తా, మౌమిత మజుందార్ జంటగా మారారు.
తమ జీవిత భాగస్వాములను ఎంచుకునేందుకు ఎల్జీబీటీక్యూ జంటలకు ఈ వివాహాలు ఆదర్శంగా నిలుస్తాయని భావిస్తున్నారు. కోల్‌కతాలో తొలిసారిగా 2018లో సుచేంద్ర దాస్, శ్రీ ముఖర్జీలు ఈ తరహా వివాహం చేసుకుని వార్తల్లో నిలిచారు. ప్రేమ ఎన్నటికీ ప్రేమేనని, ప్రేమలో పడే సమయంలో జెండర్ అనేది అరుదుగా ముందుకొస్తుందని మౌసుమి చెప్పుకొచ్చారు. ప్రేమకు కావాల్సింది సరైన వ్యక్తి దొరకడం వారు హృదయానికి తాకడమే ప్రధానమని అన్నారు.
ప్రేమ అన్నింటినీ జయిస్తుందని చెప్పారు. ఇక 2018లో స్వలింగ సంపర్కం నేరం కాదని తేల్చగా ఒకే జెండర్ కలిగిన వారు వివాహం చేసుకోవడం దేశంలో ఇప్పటికీ చట్టవిరుద్ధం. సమాజ పురోగతిలో కోల్‌కతా ముందువరసలో నిలవగా మౌమిత, మౌసుమి ఇందుకు మరో ఉదాహరణగా నిలిచారు.
Read More
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

