కేశాలలో ఓ మూలన దాక్కున్న స్ట్రెస్ హార్మోన్లు గుండె జబ్బుల గుట్టు విప్పుతాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఇటీవల ఐర్లండ్‌లో జరిగిన యూరోపియన్ కాంగ్రెస్ ఆన్ ఒబేసిటీ సదస్సులో దీనికి సంబంధించి లోతైన చర్చ జరిగింది. మనిషి ఒత్తిడికి గురైనప్పుడు.. కేశాలలోని గ్లూకో కార్టికాయిడ్ అనే స్టెరాయిడ్ హార్మోన్లు విడుదల అవుతాయి.
ఈ పరిమాణం పెరిగేకొద్దీ గుండె జబ్బులకు దగ్గర అవుతున్నట్టు అర్థం. ఒత్తిడి మనిషిని నిలువునా దెబ్బ తీస్తుంది. సకల రోగాలకూ కారణం అవుతుంది. మన జుట్టులో గ్లూకో కార్టికాయిడ్ హార్మోను ఏ స్థాయిలో ఉంది, ఎంత కాలం నుంచీ ఉంది? అనే విషయాన్ని నిర్ధారణ చేసుకుంటే.. గుండె జబ్బు తీవ్రత కూడా తెలిసిపోతుంది. పద్దెనిమిది సంవత్సరాలకు పైబడిన ఆరున్నరవేలమంది స్త్రీ పురుషులలో గ్లూకో కార్టికాయిడ్ స్థాయిని పరిశీలించిన నిపుణులు ఈ నిర్ణయానికి వచ్చారు.