షాదోల్: మధ్యప్రదేశ్లోని షాదోల్ అటవీ ప్రాంతంలో ఉన్న సోన్ నది వద్దకు కొందరు ఫ్రెండ్స్ పిక్నిక్ వెళ్లారు. అక్కడి పొదల్లో తిరుగుతున్న చిరుత(Leopard Attack)ను చూశారు. వాళ్లు ఆ చిరుతను రెచ్చగొట్టారు. ఆజా ఆజా అంటూ అరిచారు. దీంతో చిర్రెక్కిన ఆ చిరుత.. యువకులపై తిరుగబడింది. అడవి పొదల నుంచి యువకులపైకి దూసుకొచ్చింది. దాంట్లో ఓ యువకుడు తన వద్ద ఉన్న మొబైల్ కెమెరాతో ఇదంతా చిత్రీకరించాడు.
Leopard attack in Shahdol range of Madhya Pradesh pic.twitter.com/iXYnxnkXSD
— Dilshad (@dilshad_akhtar1) October 21, 2024
కానీ ఈ లోపు ఆ చిరుత వచ్చి ముగ్గురిపై అటాక్ చేసింది. ఇద్దర్నీ గాయపరిచింది. ఓ వ్యక్తిని ఏకంగా కిందపడేసి లాగేసింది. అయితే వెంటనే తేరుకున్న యువకులు..ఒక్కసారిగా ఆ చిరుత వైపు దూసుకెళ్లారు. దీంతో ఆ చిరుత ఉడాయించింది. ఈ ఘటనకు చెందిన 30 సెకన్ల వీడియో ప్రస్తుతం వైరల్ అవుతున్నది. అడవి లోపలికి వెళ్లవద్దు అంటూ పోలీసులు వార్నింగ్ జారీ చేశారు.