ఓ పెంపుడు కుక్కపై చిరుత పులి దాడి చేసింది. అయితే చిరుత దాడి నుంచి కుక్క తప్పించుకునేందుకు ప్రయత్నించింది. కానీ విఫలమైంది.
మహారాష్ట్ర నాసిక్ జిల్లాలోని ముంగ్సరి గ్రామంలోని ఓ ఇంటి ప్రహరీ గోడపై పెంపుడు కుక్క కూర్చుంది. ఈ నెల 5వ తేదీన అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఆ ఇంటి వైపు చిరుత పులి వచ్చింది. గోడపై కూర్చున్న కుక్క.. చిరుతను చూసి కిందకు దూకింది. దీంతో చిరుత కూడా కొంచెం కన్ఫ్యూజ్కు గురైంది. కుక్క మళ్లీ ప్రహరీ గోడను దూకి బయటకు వెళ్లింది. క్షణాల్లోనే కుక్కను చిరుత అటాక్ చేసింది. కుక్కపై దాడి చేసిన చిరుత అటు నుంచి జారుకుంది. ఈ దృశ్యాలన్ని ఆ ఇంటి ఆవరణలో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
#WATCH | Leopard entered a residential area in Mungsare village of Nashik, attacked a pet dog yesterday
(Source: CCTV) pic.twitter.com/OznDoeQvHR
— ANI (@ANI) June 6, 2022