ఓ చిరుత గాండ్రిపులు విన్న పెంపుడు కుక్క తీవ్ర గందరగోళానికి గురైంది. ఆ గాండ్రిపులకు ధీటుగానే కుక్క కూడా అరవసాగింది. అంతలోనే గేటు బయట ఉన్న చిరుత పులి.. ఒక్కసారిగా గ్రౌండ్లోకి దూకింది. అప్రమత్తమైన కుక్క ఆ పులి నుంచి తప్పించుకునేందుకు యత్నించింది. కానీ ప్రయత్నం బెడిసికొట్టింది.
ఆ పెంపుడు కుక్కపై దాడి చేసిన చిరుత.. దాన్ని గొంతు పట్టుకొని.. గేటు వెలుపలకు దూకింది. ఈ దృశ్యాలన్నీ ఆ ఇంటి ఆవరణలో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ కశ్వాన్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.