Viral Video | అడవిలో మేత మేస్తున్న ఓ జింకపై చిరుత దొంగచాటుగా దాడి చేసింది. చిరుత తెలివి చూస్తే వావ్ అనక తప్పరు. ఆ విధంగా జింకపై దాడి చేసింది చిరుత పులి. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ రమేశ్ పాండే తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
అడవిలో ఉన్న ఓ చెట్టు సమీపంలో జింక మేత మేస్తోంది. జింక చిరుత కంట పడింది. అయితే నేరుగా చిరుత దాడి చేయకుండా, తెలివిగా దెబ్బకొట్టింది. అక్కడ ఉన్న రహదారి పొడవునా కొంచెం ఎత్తులో మట్టి ఉంది. ఆ మట్టిని అడ్డుగా చేసుకున్న చిరుత నక్కినక్కి ఓ చెట్టు వద్దకు వెళ్లింది. ఇంకేముంది చెట్టును అడ్డు పెట్టుకుని జింకపై దాడి చేసింది. అప్రమత్తమైన జింక పరుగు పెట్టినప్పటికీ చిరుత నుంచి తప్పించుకోలేకపోయింది. వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు చాలా రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. చిరుత చాలా తెలివిగా ప్రదర్శించిందని పేర్కొన్నారు.
Leopards are smart and stealthy…!
VC: SM pic.twitter.com/Fea0ftqLte
— Ramesh Pandey (@rameshpandeyifs) December 17, 2022