e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, January 21, 2022
Home News చట్టసభలకు అంతరాయం కలుగకుండా చూడాలి : వెంకయ్యనాయుడు

చట్టసభలకు అంతరాయం కలుగకుండా చూడాలి : వెంకయ్యనాయుడు

బెంగళూరు : ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించాల్సిన చట్టసభల సమావేశాలకు తరచుగా కలుగుతున్న అంతరాయాల పట్ల, ప్రజాస్వామ్య వ్యవస్థ నవ్వులపాలు అవుతుండడం పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్, రాష్ట్రాల శాసన సభల సమావేశాలు అర్ధవంతంగా ప్రజల జీవన ప్రమాణాలను పెంచే విధంగా, యువతకు ఆదర్శంగా ఉండి, ప్రజాప్రతినిధులు ఆదర్శనీయులుగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. బుధవారం బెంగళూరులో ఫెడరేషన్ ఆఫ్ కర్ణాటక చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌కేసీసీఐ) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య స్మారక అవార్డు ప్రదానోత్సవంలో ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఇటీవల రాజ్యసభ సమావేశాలకు తరచూ అంతరాయాలు కలుగడం, సభ సజావుగా ముందుకు సాగకపోవడం తనకు ఎంతగానో బాధించిందని చెప్పారు. పార్లమెంట్ స్థాయిని దిగజార్చేలా కొందరు సభ్యులు ప్రవర్తించారని, ఇదే తనకు దుఃఖాన్ని కలిగించిందని తెలిపారు.

భారతదేశ ఆర్థిక వ్యవస్థను, ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాలను మరింత సుస్థిరం చేసేందుకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య వంటి మహనీయుల స్ఫూర్తితో నూతన ఆవిష్కరణల దిశగా యువత ముందుకు కదలాల్సిన అవసరం ఉన్నదని, ఈ దిశగా వారిని మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. దేశంలో క్షేత్రస్థాయిలో నూతన ఆవిష్కరణకోసం ప్రయత్నిస్తున్నవారిని గుర్తించి, ప్రోత్సహించి వారికి కావాల్సిన సహాయాన్ని అందించడం ద్వారా వారిని వాణిజ్యపరంగా బలోపేతం చేయవచ్చునన్నారు. విద్యార్థులు తమ సృజనాత్మకతను చాటుకునేందుకు అవసరమైన ‘ఇన్నొవేషన్ హబ్స్’ ను కళాశాలల్లో ఏర్పాటు చేయాలన్నారు. ఈ వేదిక ద్వారా మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు ఘనంగా నివాళులు అర్పించిన ఉపరాష్ట్రపతి.. విశ్వేశ్వరయ్య ఆధునిక భారత నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన ఇంజనీర్ అని, మౌలికవసతుల నిర్మాత అని ప్రశంసించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఎమ్మెస్ రామయ్య గ్రూప్ సంస్థల చైర్మన్ డాక్టర్ ఎమ్మార్ జయరామ్‌కు ఎం విశ్వేశ్వరయ్య స్మారక అవార్డును వెంకయ్యనాయుడు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మాయ్, పార్లమెంట్ సభ్యులు పీసీ మోహన్, ఎఫ్‌కేసీసీఐ అధ్యక్షులు పెరికల్ ఎం సుందర్‌తోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

ఈ రోబోలు మనిషిలాగే దుంకుతాయి..!

ఎనర్జీ డ్రింక్స్‌ తాగుతున్నారా..? అయితే, ఇది మీ కోసమే..!

త్వరలో మళ్లీ హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డులు

 ఆఫ్ఘాన్‌ను తాలిబాన్‌ ఆక్రమించుకోవడం సబబే: సజ్జాద్‌ నోమాని

ప్రాణాలకు తెగించి హక్కుల కోసం గళమెత్తారు..

నేతాజీ… గగన సిగలకెగసి కనుమరుగై పోయాడు..

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement