న్యూఢిల్లీ, జూలై 14: ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మారథానర్ అనే ట్యాగ్ పొందిన 114 ఏండ్ల దిగ్గజ మారథాన్ రన్నర్ ఫౌజా సింగ్ సోమవారం ఒక రోడ్డు ప్రమాదంలో మరణించారు.
జలంధర్లో 1911 ఏప్రిల్ 1న జన్మించిన ఫౌజా సింగ్ను జలంధర్-పఠాన్కోట్ హైవేపై మధ్యాహ్నం ఒక కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. అతడిని దవాఖానకు తరలించగా రాత్రి మరణించారని అధికారులు తెలిపారు.