Fashion Designer Rohit Bal | లెజెండరీ ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్ (63) అనారోగ్యంతో శుక్రవారం కన్ను మూశారు. కొన్ని వారాల క్రితం రోహిత్ బాల్ మాట్లాడుతూ తన ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకుని తిరిగి తన ఫ్యాషన్ సర్క్యూట్ లోకి వచ్చేస్తానని లాక్మే ఫ్యాషన్ వీక్ లో మాట్లాడుతూ చెప్పారు. ఫ్యాషన్ డిజైనింగ్‌లో సృజనాత్మక పద్దతులకు పెట్టింది పేరు రోహిత్ బాల్. ఫ్యాషన్ డిజైన్ రంగంలో సుసంపన్న భారత సంస్కృతికి మెరుగులు దిద్దడంతో ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించారు.
భారతీయ ఫ్యాషన్‌ను వారసత్వంగా శాశ్వతంగా ఆధునికంగా తీర్చిదిద్దిన వ్యక్తి రోహిత్ బాల్. భారత డిజైనింగ్ స్టైల్ మెరుగుదలకు ఆయన చేసిన కృషిని భావి తరాలు గుర్తుంచుకుంటాయి. ఫ్యాషన్ డిజైన్ పరిశ్రమ ఒక ట్రెయిల్ బ్లేజర్‌ను కోల్పోయింది. రోహిత్ బాల్ మరణం పట్ల ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌డీసీఐ) తీవ్ర సంతాపం తెలిపింది. ఆయన మృతి దురదృష్టకరం అని పేర్కొంది.