MVA leaders meet : మహారాష్ట్ర (Maharastra) లో అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) హడావిడి మొదలైంది. ఈ ఏడాది ఆఖరులో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడి అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహా ప్రతివ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సమాయత్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళ ప్రతిపక్ష మహా కూటమి (MVA) నేతలు సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో కూటమి నేతలు సీట్ల పంపకంపై చర్చిస్తున్నట్లు సమాచారం. రాబోయే ఎన్నికల్లో ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే విషయంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరుగుతున్నట్లు తెలిసింది. కూటమిలోని ప్రధాన పార్టీలైన ఉద్ధవ్ థాకరే శివసేన పార్టీ, నేషనలిస్ట్ కాన్ఫరెన్స్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇప్పటికే జమ్ముకశ్మీర్, హర్యానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అక్టోబర్ 8న ఫలితాలు వెల్లడికానున్నాయి.
#WATCH | Mumbai: Leaders of the MVA (Maha Vikas Aghadi) hold a meeting to have discussions on seat sharing in the upcoming Maharashtra Assembly elections.
(Source: LOP Wadettiwar’s Office) pic.twitter.com/hlpx2YSN8B
— ANI (@ANI) September 30, 2024