Delhi | న్యూఢిల్లీ, ఆగస్టు 8: అందరికీ న్యాయం చెప్పే న్యాయస్థానం ప్రాంగణంలోనే ఒక న్యాయవాది తనపై లైంగిక దాడికి పాల్పడినట్టు 21 ఏండ్ల మహిళ సబ్జీ మండీ పోలీస్ స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేసింది. ఉద్యోగం ఇప్పిస్తానని ఉత్తర ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టులోని తన చాంబర్‌కు పిలిపించిన ఒక న్యాయవాది తనపై లైంగిక దాడికి పాల్పడినట్టు ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.
ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించి 1500 రూపాయలు ఇచ్చి పంపించివేశాడని, దీంతో తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.