simultaneous polls | 2024 లోగా జమిలి ఎన్నికలు సాధ్యం కాదు : లా కమిషన్
2024లో జమిలి ఎన్నికలు (simultaneous polls) జరగబోవని లా కమిషన్ వర్గాలు శుక్రవారం పేర్కొన్నాయి.
న్యూఢిల్లీ : 2024లో జమిలి ఎన్నికలు (simultaneous polls) జరగబోవని లా కమిషన్ వర్గాలు శుక్రవారం పేర్కొన్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల లోపు ఒకే దేశం ఒకే ఎన్నికల వ్యవస్ధ సాధ్యం కాదని లా కమిషన్ వర్గాలు భావిస్తున్నాయి. జమిలి ఎన్నికలపై లా కమిషన్ నివేదిక 2024 లోక్‌సభ ఎన్నికల లోగా ప్రచురించే అవకాశం ఉందని లా కమిషన్ చైర్మన్ జస్టిస్ రుతురాజ్ అవస్ధి ఇటీవల వెల్లడించారు. ఏకకాల ఎన్నికలపై కసరత్తు ఇంకా జరుగుతున్నందున నివేదిక పనులు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పుకొచ్చారు.
దేశంలో జమిలి ఎన్నికలకు అవసరమైన రాజ్యాంగ సవరణలను ఈ నివేదిక ప్రభుత్వానికి సూచిస్తుందని చెబుతున్నారు. గత ఏడాది డిసెంబర్లో 22వ లా కమిషన్ జమిలి ఎన్నికల ప్రతిపాదనపై జాతీయ రాజకీయ పార్టీలు, ఈసీ, అధికారులు, విద్యావేత్తలు, నిపుణుల అభిప్రాయాలు కోరేందుకు ఆరు ప్రశ్నలను రూపొందించింది.
ఇక జమిలిపై కసరత్తు అనంతరం 2024 లోక్‌సభ ఎన్నికల్లోగా లా కమిషన్ తన నివేదికను సిద్ధం చేసి కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖకు సమర్పిస్తుందని భావిస్తున్నారు. లోక్‌సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం ద్వారా ప్రజా ధనాన్ని ఆదా చేయడంతో పాటు నిర్వహణ వ్యవస్ధ, భద్రతా దళాలపై భారాన్ని తగ్గించవచ్చని, ప్రభుత్వ పధకాలు, విధానాలను మెరుగ్గా అమలు చేయవచ్చని 2018లో 21వ లా కమిషన్ కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు అందచేసిన ముసాయిదా నివేదికలో పేర్కొంది.
Read More :
Teacher Arrest | దారుణం.. పిల్లల్ని గాడిన పెట్టాల్సిన టీచర్ ఏం చేసిందంటే..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

