న్యూఢిల్లీ: ఒకే దేశం.. ఒకే ఎన్నికపై లా కమిషన్ శుక్రవారం కీలక ప్రకటన చేసింది. జమిలి ఎన్నికలు 2024లో సాధ్యం కావని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న చట్టంలో రాజ్యాంగ సవరణలు చేయకుండా జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని తేల్చి చెప్పింది. రాజ్యాంగ సవరణల కోసం మరిన్ని సమావేశాలు అవసరమని పేర్కొంది.
ఇదిలావుంటే 2029 నుంచి లోక్సభ ఎన్నికలతోపాటే అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించేందుకు లా కమిషన్ ఓ ఫార్ములాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలకు సిద్ధమవుతుందన్న ప్రచారం జరుగుతున్న వేళ లా కమిషన్ చేసిన ప్రకటన జమిలి ఎన్నికలు ఇప్పట్లో లేనట్లేనని తేల్చేసింది.