కుల్దీప్ స్కాడ్రన్ లీడర్: 2015 జూన్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో హెలికాప్టర్ పైలట్‌గా చేరారు.
హర్జిందర్ సింగ్ లెఫ్టినెంట్ కల్నల్: 2001లో ఆర్మీలో చేరి, వాస్తవాధీన రేఖ, నియంత్రణ రేఖ వద్ద పనిచేశారు.
నాయక్ గురుసేవక్ సింగ్ 2004 మార్చిలో ఆర్మీలో చేరారు. లఢక్, జమ్ము, కశ్మీర్లో సేవలు అందించారు.
లాన్స్ నాయక్ వివేక్ కుమార్: పారా స్పెషల్ ఫోర్స్‌లో భాగంగా పనిచేస్తున్న వివేక్.. 2012 డిసెంబర్లో ఆర్మీలో చేరారు.
లాన్స్ నాయక్ జితేందర్ కుమార్ :2011 మార్చిలో ఆర్మీలో చేరారు. భారత్-పాక్ సరిహద్దుల్లో ఎడారి ప్రాంతంలో పనిచేశారు.
హల్విందర్ సత్పాల్ రాయ్:2002 మార్చిలో ఆర్మీలో చేరారు. సియాచిన్, నౌషేరా, నాగాలాండ్, మణిపూర్‌లో సేవలు అందించారు.
ఆర్పీ దాస్జూనియర్ వారంట్ ఆఫీసర్: 2006లో ఫ్లైట్ ఇంజినీర్‌గా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో చేరారు.
పీఎస్ చౌహాన్ వింగ్ కమాండర్: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో హెలికాప్టర్ పైలట్‌గా 2002 జూన్‌లో చేరారు.
బ్రిగేడియర్ లిద్దర్.. 1990లో జమ్ముకశ్మీర్ రైఫిల్స్‌లో చేరారు. సీడీఎస్‌కు డిఫెన్స్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు.
ప్రదీప్జూనియర్ వారంట్ ఆఫీసర్: 2006 జూన్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఫ్లైట్ గన్నర్‌గా చేరారు.
సాయితేజ లాన్స్ నాయక్ 2013 జూన్‌లో ఆర్మీలో చేరారు. మణిపూర్, నాగాలాండ్‌లో టెర్రరిస్టులను ఏరివేసే ఆపరేషన్లలో పాల్గొన్నారు.
చిత్తూరు జిల్లాకు చెందిన లాన్స్‌నాయక్ సాయితేజ కుటుంబానికి అండగా ఉంటానని సినీనటుడు, మా అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. తమ విద్యా సంస్థలో సాయితేజ పిల్లలకు ఉచిత విద్య అందిస్తామని హామీ ఇచ్చారు.