న్యూఢిల్లీ, జూన్ 5: ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ ముస్లింలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం ఇప్పుడు తాపీగా వివరణ ఇచ్చింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో ఉన్న ఇద్దరు అగ్రనేతల జోలికి వెళ్లరాదని తాము ఉద్దేశపూర్వకంగానే నిర్ణయించుకున్నట్టు ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ ‘స్క్రోల్’ న్యూస్ వెబ్పైట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ‘భారత్ లాంటి పెద్ద దేశంలో కీలకమైన హోదాల్లో ఉన్నవారికి తగిన బాధ్యత కూడా ఉంది. అందుకే మేము వారికి బాధ్యతలను గుర్తుచేశాం. అయితే ఇద్దరు పార్టీల నేతల పట్ల సమానంగానే వ్యవహరించాం’ అని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు.