Terrorist Caught In Jammu | జమ్ములో లష్కరే ఉగ్రవాది పట్టివేత.. అతడు బీజేపీ ఐటీ సెల్ చీఫ్!
Terrorist Caught In Jammu | జమ్ముకశ్మీర్‌లో వాంటెడ్ లష్కరే ఉగ్రవాదిని పోలీసులు పట్టుకున్నారు. అతడు బీజేపీ కార్యకర్త అని తేలింది.
Terrorist Caught In Jammu | జమ్ముకశ్మీర్‌లో స్థానికులే ఆదివారం వాంటెడ్ లష్కర్-ఈ-తొయిబా ఉగ్రవాదిని పట్టుకున్నారు. అటుపై పోలీసులకు అప్పగించారు. అయితే, అతడు బీజేపీ యాక్టివ్ కార్యకర్త కావడం గమనార్హం. బీజేపీ మైనారిటీ మోర్చా సోషల్ మీడియా జమ్ము ఇన్చార్జి కూడా. జమ్ములోని రియాసీ ప్రాంతంలో ఆదివారం ఉదయం లష్కరే ఈ తొయిబా ఉగ్రవాది తాలిబ్ హుస్సేన్ షా, ఆయన అనుచరులను స్థానికులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రెండు ఏకే రైఫిల్స్, పలు హ్యాండ్ గ్రనేడ్లు, ఇతర ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఆ ఉగ్రవాదులను స్థానిక పోలీసులకు అప్పగించారు.
అయితే, వ్యక్తుల నేపథ్యం తనిఖీ చేయకుండానే ఆన్లైన్లో పార్టీసభ్యత్వం ఇవ్వడమే దీనికి కారణమని బీజేపీ చెబుతున్నది. `ఈ అరెస్ట్‌తో కొత్త అంశం వెలుగులోకి వచ్చింది` అని బీజేపీ అధికార ప్రతినిధి ఆర్ఎస్ పథానియా చెప్పారు. `ఈ రోజు ఇది కొత్త మోడల్. బీజేపీలోకి ప్రవేశించి, నాయకులతో సాన్నిహిత్యం పెంచుకుని అగ్రనేతలను చంపేందుకు చేసిన కుట్రను పోలీసులు బయటపెట్టారు` అని అన్నారు.
`సరిహద్దు పొడవునా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నవారు ఎవరైనా ఆన్లైన్లో బీజేపీ సభ్యత్వం పొందొచ్చు. ఆన్లైన్లో బీజేపీ సభ్యత్వం తీసుకుంటున్న వారి క్రిమినల్ రికార్డు చెక్ చేయడానికి ఎటువంటి వ్యవస్థ లేకపోవడం లోపమే` అని ఆర్ఎస్ పథానియా అన్నారు. గత మే 9న బీజేపీ జమ్ము ఐటీ, సోషల్ మీడియా ఇన్చార్జిగా తాలిబ్ హుస్సేన్ షాను బీజేపీ నియమించింది. అతడి వద్ద ఫోన్లో జమ్ముకశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీంద్ర రైనాతోపాటు పలువురు సీనియర్ నేతల ఫొటోలు ఉన్నాయని అన్నారు.
ఇదిలా ఉండగా, తాలిబ్ హుస్సేన్ అనే లష్కర్-ఈ-తొయిబా ఉగ్రవాదిని పట్టుకున్న గ్రామస్థులకు, జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్, పోలీసు అధిపతి క్యాష్ రికార్డు ప్రకటించారు. రియాసీలోని టుక్సన్ ఢోక్ గ్రామస్తుల ధైర్యాన్ని అభినందిస్తున్నట్లు అదనపు డీజీపీ ముకేశ్ సింగ్ తెలిపారు. ఉగ్రవాదులను పట్టుకున్న గ్రామస్తులకు డీజీపీ రూ.2 లక్షల నగదు అవార్డు ప్రకటించారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా రూ.5 లక్షల అవార్డు ప్రకటించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BJP
- Jammu
- Lashkar Terrorist
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

