న్యూఢిల్లీ: భారత్‌లో మూడు ప్రధాన ఉగ్రదాడులకు సూత్రధారి, లష్కరే అగ్రనేత సైఫుల్లా ఖలీద్ పాక్‌లోని సింధు ప్రావిన్స్‌లో హతమయ్యాడు. గుర్తు తెలియని దుండగులు అతనిపై దాడి చేసి హతమార్చారు. నాగ్‌పూర్, రాంపూర్, బెంగళూరుల్లో జరిగిన మూడు ప్రధాన ఉగ్ర దాడుల ప్రణాళిక కర్త సైఫుల్లా ఖలీదే.
2001లో రాంపూర్‌లో సీఆర్పీఎఫ్ శిబిరంపై, 2005లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌పై, 2006లో నాగ్‌పూర్‌లోని ఆర్ఎస్ఎస్ హెడ్‌క్వార్టర్స్‌పై దాడులకు ఇతనే ప్రధాన కుట్రదారుడు. ఐదేండ్ల వ్యవధిలో మూడు ప్రధాన దాడుల ద్వారా ఎల్ఈటీ కార్యకలాపాలను భారత్‌లో భారీగా విస్తరించాడు.