న్యూఢిల్లీ: విమాన ప్రమాదాల నివారణలో లోపాలను గుర్తించిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) దీనిపై చర్యలు చేపట్టింది. ఎయిరిండియా (Air India) ఫ్లైట్ సేఫ్టీ చీఫ్‌ను నెల రోజుల పాటు సస్పెండ్ చేసింది. జూలై 25, 26న డీజీసీఏ అధికారుల బృందం ఎయిర్ ఇండియాలో అంతర్గత ఆడిట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రమాదాల నివారణలో లోపాలు, అవసరమైన సాంకేతిక సిబ్బంది లభ్యత వంటి అంశాలను పరిశీలించింది. అయితే ఎయిర్ ఇండియా సంస్థ ఆడిట్లో పేర్కొన్న అంశాలు సంబంధిత నిబంధనలకు అనుగుణంగా లేవని గుర్తించింది.
కాగా, ఎయిర్ ఇండియా ఆడిట్, విమాన ప్రమాదాల నివారణలో లోపాలను గుర్తించిన సుమారు రెండు నెలల తర్వాత డీజీసీఏ చర్యలు చేపట్టింది. ప్రమాణాల మేరకు సంబంధిత పనుల్లో తగిన శ్రద్ధ లోపించడంతో ఆడిట్లు, నిఘా, స్పాట్ తనిఖీల కోసం ఎవరినీ కేటాయించవద్దని సూచించింది. అలాగే ఎయిర్ ఇండియా చీఫ్ ఆఫ్ ఫ్లైట్ సేఫ్టీ ఆమోదాన్ని నెల రోజుల పాటు నిలిపివేసినట్లు డీజీసీఏ పేర్కొంది. ఈ మేరకు గురువారం ఆ సంస్థకు నోటీస్ జారీ చేసింది.