పాట్నా: బీహార్‌లో రాజకీయ సమీకరణలు మరోసారి మారే సంకేతాలు కనిపిస్తున్నాయి. మాజీ సీఎం, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిలో తిరిగి చేరేందుకు సీఎం నితీశ్ కుమార్‌కు (Nitish Kumar) తలుపులు తెరిచే ఉన్నాయని అన్నారు.
కాగా, బీహార్ కొత్త గవర్నర్‌గా ఆరిఫ్ మహ్మద్ ఖాన్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యలపై స్పందించాలని సీఎం నితీశ్ కుమార్‌ను మీడియా అడిగింది. దీంతో మీరు ఏం చెబుతున్నారు? అని ఆయన అడిగారు. అలాగే నవ్వుతూ, చేతులూ జోడిస్తూ సమాధానాన్ని దాటవేశారు. ఈ నేపథ్యంలో బీహార్‌లో మరోసారి రాజకీయ సమీకరణలు మారే అవకాశమున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మరోవైపు బీహార్‌ను స్వతంత్రంగా నడిపించే సామర్థ్యం సీఎం నితీశ్ కుమార్‌కు లేదని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ విమర్శించారు. చిన్న సమూహానికి ఆయన బందీగా ఉన్నారని ఆరోపించారు. ఈ కొత్త సంవత్సరంలో నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అంతమవుతుందని అన్నారు.
#WATCH | Patna: Bihar CM Nitish Kumar reacts on being asked about Lalu Prasad Yadav’s statement. pic.twitter.com/6Gxb9iOZgP
— ANI (@ANI) January 2, 2025