న్యూఢిల్లీ : లఖింపూర్ ఖేరీ హింసాత్మక ఘటనపై సోమవారం సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఘటనపై దర్యాప్తును హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని జరిపేందుకు యూపీ సర్కారు గీకరించింది. దీంతో ఈ కేసు దర్యాప్తుపై ఆదేశాలను బుధవారం జారీ చేస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. సిట్ బృందంలో సీనియర్ ఐపీఎస్ అధికారులకు చోటు కల్పించాలని, వారి పేర్లను మంగళవారంలోగా యూపీ ప్రభుత్వం సిఫారసు చేయాలని ఆదేశిస్తూ కేసు విచారణను బుధవారానికి వాయిదా వేసింది. విచారణ సందర్భంగా యూపీ ప్రభుత్వం తరఫున హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు.
ధర్మాసనం ఏ హైకోర్టుకు (అలహాబాద్ హైకోర్టుతో సహా) చెందిన రిటైర్డ్ జడ్జినైనా కేసు విచారణ కోసం నియమించవచ్చని తెలిపారు. ఇంతకు ముందు సుప్రీం కోర్టు.. హైకోర్టు మాజీ న్యాయమూర్తిని నియమించాలని గతంలో ప్రభుత్వాన్ని ఆదేశించింది. రిటైర్డ్ న్యాయమూర్తులు రాకేశ్‌కుమార్ జైన్, రంజిత్ సింగ్ పేర్లను సిఫారసు చేసింది. కొంతమంది సీనియర్ పోలీస్ అధికారులను కూడా సిట్‌లో చేర్చాలని ఆదేశించింది. ఇంతకు ముందు జరిగిన విచారణలో ఘటనకు సంబంధించిన సాక్షులకు భద్రత కల్పించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అలాగే హింసాకాండలో జర్నలిస్ట్ రమణ్ కశ్యప్, శ్యామ్ సుందర్ హత్య కేసు దర్యాప్తుపై సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.