కోర్టులో లొంగిపోయిన కేంద్రమంత్రి తనయుడు ఆశిష్ మిశ్రా
లక్నో : కేంద్రమంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా ఆదివారం కోర్టులో లొంగిపోయారు. దీంతో ఆయనను తిరిగి లఖింపూర్ జైలుకు తరలించారు. లఖింపూర్‌ఖేరి హింసాత్మక ఘటనలో ఆశిష్ మిశ్రాకు మంజూరైన బెయిల్‌ను సుప్రీం కోర్టు గతవారం రద్దు చేసిన విషయం తెలిసిందే. వారం రోజుల్లో లొంగిపోవాలని ఆదేశించింది. గతేడాది అక్టోబర్‌లో లఖింపూర్ ఖేరిలో ఆందోళన చేస్తున్న రైతులపైకి ఆశిష్ మిశ్రా కారు దూసుకెళ్లిన విషయం తెలిసిందే.
ఈ ప్రమాదంలో నలుగురు రైతులతో పాటు మరో నలుగురు మృతి చెందారు. ఈ కేసులో అశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు ఫిబ్రవరి 10న బెయిల్ మంజూరు చేయగా.. ఆ తర్వాత బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ మేరకు విచారణ జరిపిన సుప్రీం కోర్టు ధర్మాసనం బెయిల్‌ను రద్దు చేస్తూ ఈ నెల 18న ఉత్తర్వులు జారీ చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

