MP Khagen Murmu | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): ఎన్నికల ప్రచారంలో భాగంగా వీధుల్ని శుభ్రం చేయడం, పసి పిల్లలకు స్నానాలు చేయించడం వంటి పనులను రాజకీయనేతలు చేస్తుంటారు. అయితే, బెంగాల్లోని ఉత్తర మాల్దా బీజేపీ ఎంపీ ఖగేన్ ముర్మూ తాజాగా చేసిన ఓ పని వివాదాన్ని రేపింది.
సోమవారం శ్రిహిపూర్ గ్రామంలో ఇంటింటి ప్రచారానికి వెళ్లిన ఆయన.. ఓ యువతి చెంపపై ముద్దు పెట్టారు. దీనిపై విమర్శలు రావడంతో స్పందించిన ఎంపీ.. సదరు యువతిని కుమార్తెగా భావించే అలా చేశానని చెప్పుకొచ్చారు.