న్యూఢిల్లీ: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో గంగ, యమున, సరస్వతి(అంతర్వాహిని) నదుల సంగమ స్థలి వద్ద చక్కని స్నానం చేసినట్టు ఇటీవల వ్యాఖ్యానించిన మథురకు చెందిన బీజేపీ ఎంపీ హేమమాలిని తాజాగా మరో వివాదానికి తెరతీశారు.
జనవరి 29న మహా కుంభమేళాలో తొక్కిసలాట జరిగి 30 మంది మరణించడం, మరో 60 మందికిపైగా గాయపడిన సంఘటనను అదేమంత పెద్ద ప్రమాదం కాదు అంటూ వ్యాఖ్యానించారు. మహాకుంభ్‌లో జరిగిన ఘటన పెద్ద ప్రమాదమేమీ కాదని అన్నారు.
మహా కుంభ్ కోసం సీఎం యోగి ప్రభుత్వం చక్కని ఏర్పాట్లు చేసిందని ప్రశంసించారు. ఊహించని రీతిలో భక్తులు ప్రవాహంలా వస్తున్న దృష్ట్యా అంత మందిని కట్టడి చేయడం ఎవరికైనా కష్టమేనని, ప్రతిపక్షాలు తమకు తోచింది మాట్లాడుతుంటాయని, విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయని హేమమాలిని విమర్శించారు.