కోల్‌కతా: ఈ ఉదయం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సుష్మితాదేవ్ మధ్యాహ్నం టీఎంసీలో చేరారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి మేనల్లుడు అభిషేక్ బెనర్జి, టీఎంసీ సీనియర్ నాయకుడు డెరెక్ ఓ బ్రియాన్ సమక్షంలో ఆమె తృణమూల్ కండువా కప్పుకున్నారు. అభిషేక్ బెనర్జి స్వయంగా ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కాగా, సుశ్మితాదేవ్ 2014 సాధారణ ఎన్నికల్లో అసోంలోని సిల్చార్ స్థానం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత పార్టీ ఆమను ఆలిండియా మహిళా విభాగం అధ్యక్షురాలిగా కూడా నియమించింది. అయితే, ఉన్నట్టుండి సుష్మితాదేవ్ పార్టీ నుంచి వైదొలగడంతో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. కాగా, రాజీనామాకు ముందే సుష్మితాదేవ్ వాట్సాప్ గ్రూప్‌ల నుంచి వైదొలిగారు.
Kolkata, West Bengal: Sushmita Dev, who resigned from Congress today, joins TMC in the presence of party leaders Abhishek Banerjee and Derek O'Brien. pic.twitter.com/4KFNVKm3V8
— ANI (@ANI) August 16, 2021