Kolkata Incident : దేశవ్యాప్తంగా కలకలం రేపిన కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచార ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగుచూస్తున్నాయి. హత్యాచార ఘటనకు ముందు రాత్రి మరో మహిళను కూడా నిందితుడు సంజయ్ రాజ్ లైంగిక వేధింపులకు గురిచేశాడు. విచారణ సందర్భంగా సంజయ్ రాయ్ ఈ వివరాలు వెల్లడించాడని సీబీఐ వర్గాలు తెలిపాయి.
నేరం జరిగిన రోజు రాత్రి అతడి కదలికలకు సంబంధించి రాయ్ పూర్తి వివరాలను తెలిపాడని ఆ వర్గాలు పేర్కొన్నాయి. రెడ్‌లైట్ ఏరియాలను సందర్శించానని, కానీ అక్కడ శృంగారంలో పాల్గొనలేదని చెప్పాడు. వీధిలో ఓ మహిళను వేధించానని నిందితుడు చెప్పగా ఆ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. తన గర్ల్‌ఫ్రెండ్‌తో వీడియో కాల్లో మాట్లాడి ఆమె నగ్న చిత్రాలు పంపాలని కోరానని చెప్పాడు.
నేరం జరిగిన రాత్రి జరిగిన విషయాలను నిందితుడు నెమరవేసుకున్నాడు. ఆర్జీ కర్ ఆస్పత్రి వైద్యురాలి హత్యాచార ఘటనకు సంబంధించి నిందితుడు రాయ్ (౩౩)ను బాధితురాలి మృతదేహం లభ్యమైన మరుసటి రోజే కోల్‌కతా పోలీసులు ఆగస్ట్ 10న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నిందితుడిపై దర్యాప్తు ముమ్మరం చేసి సత్వరమే కఠిన శిక్ష విధించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
Read More :
KTR | రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి.. కేటీఆర్ ట్వీట్