Neet Issue | చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా సభలో విపక్షాల అలజడి : కిరణ్ రిజిజు
Neet Issue : నీట్ అంశంపై విపక్షాలు చర్చకు పట్టుబట్టడంతో తీవ్ర గందరగోళం మధ్య లోక్‌సభ జులై 1కి వాయిదా పడింది.
Neet Issue : నీట్ అంశంపై విపక్షాలు చర్చకు పట్టుబట్టడంతో తీవ్ర గందరగోళం మధ్య లోక్‌సభ జులై 1కి వాయిదా పడింది. విపక్షాలు ఏ అంశం లేవనెత్తినా సమగ్ర సమాచారం ఇస్తామని తాము స్పష్టంగా చెప్పినా విపక్షాలు సభా కార్యకలాపాలకు అడ్డుపడటం విచారకరమని పార్లమెంటరీ వ్యవహరాల మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ప్రభుత్వం చర్చకు సిద్ధమని తాము సభ్యులకు మరోసారి హామీ ఇస్తున్నామని చెప్పారు.
ప్రభుత్వం పదేపదే చెప్పినా సభా కార్యకలపాలకు కాంగ్రెస్ సభ్యులు అడ్డుపడుతూ సభను సజావుగా జరగనివ్వకపోవడం సరైంది కాదని, దీన్ని తాను ఖండిస్తున్నానని కిరణ్ రిజిజు పేర్కొన్నారు. సభా కార్యకలాపాలకు అడ్డుతగలవద్దని ఆయా సభ్యులకు తాను విజ్ఞప్తి చేస్తున్నానని మంత్రి చెప్పారు. కాగా, నీట్ వ్యవహారంలో ప్రభుత్వ తీరును కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ తప్పుపట్టారు.
నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్‌తో లక్షలాది విద్యార్ధులు సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై విపక్ష ఇండియా కూటమి సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారని, ఇక తాను క్రిమినల్ చట్టాల అమలు నిలిపివేయాలని కోరుతూ నోటీస్ ఇచ్చానని మనీష్ తివారీ పేర్కొన్నారు. అయితే వీటిపై చర్చ జరగకపోవడం విచారకరమని ఆయన అన్నారు. ఇక దేశంలో వరుసగా జరుగుతున్న ప్రశ్నాపత్రాల లీకేజ్‌తో యువత భవిష్యత్ నాశనం చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ దీపీందర్ సింగ్ హుడా ఆందోళన వ్యక్తం చేశారు.
హరియాణలో అత్యధికంగా పేపర్ లీకేజ్ కేసులు వెలుగుచూశాయని చెప్పారు.నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకయితే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యతల నుంచి పారిపోయారని ఎద్దేవా చేశారు. తాము ఈ అంశాన్ని ఇవాళ పార్లమెంట్లో చర్చకు లేవనెత్తితే మైక్‌ను స్విచాఫ్ చేశారని మండిపడ్డారు. విపక్ష నేత మైక్‌ను నిలిపివేయడంతో విపక్ష ఎంపీలు అసంతృప్తికి లోనై ప్రభుత్వ తీరును తప్పుపట్టారని చెప్పారు. కీలకమైన నీట్ అంశంపై సభలో చర్చ జరగాలని తాము పట్టుబట్టామని ఆయన పేర్కొన్నారు.
Read More :
Lok Sabha | ఉభయ సభలను కుదిపేస్తోన్న నీట్ అంశం.. లోక్‌సభ సోమవారానికి వాయిదా
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Discussion
- Kiren Rijiju
- NDA
- neet
RELATED ARTICLES
తాజా వార్తలు
రాష్ట్రస్థాయి బాలికల కబడ్డీ విజేత నల్లగొండ జట్టు
Health tips | రోజుకో బాయిల్డ్ ఎగ్ తింటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు.. అవేంటో తెలుసా..?
సాకివాగులో ఘనంగా జన జాతీయ గౌరవ దివస్ వేడుకలు
లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు, కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ
Man Killed, Cop Injured In Firing | బంగారం లావాదేవీపై వివాదం.. కాల్పుల్లో ఒక వ్యక్తి మృతి, పోలీస్ అధికారికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

