Lok Sabha | ఉభయ సభలను కుదిపేస్తోన్న నీట్ అంశం.. లోక్‌సభ సోమవారానికి వాయిదా
Lok Sabha | నీట్ పేపర్ లీక్ అంశం (NEET issue) ఉభయ సభలను కుదిపేస్తోంది. విపక్షాల ఆందోళనలతో దిగువ సభ (Lok Sabha) సోమవారానికి వాయిదా పడింది.
Lok Sabha | నీట్ పేపర్ లీక్ అంశం (NEET issue) ఉభయ సభలను కుదిపేస్తోంది. దీనిపై చర్చ జరపాలని విపక్ష కూటమి సభ్యులు డిమాండ్ చేయడంతో (Oppositions demand for discussion on NEET issue) శుక్రవారం లోక్‌సభ, రాజ్యసభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో విపక్షాల ఆందోళనలతో దిగువ సభ (Lok Sabha) సోమవారానికి వాయిదా పడింది.
ఉదయం 11 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కాగానే రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ చర్చను లోక్‌సభలో స్పీకర్ ప్రారంభించిన వెంటనే.. విపక్షాలు సభలో నీట్ అంశాన్ని లేవనెత్తాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చను నిలిపివేసి.. నీట్ పరీక్షపై ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చించాలని పట్టుబట్టాయి. నీట్ పరీక్ష గురించి సభలో చర్చించాలని రాహుల్ డిమాండ్ చేశారు. ఇరు వైపుల నుంచి విద్యార్థులకు సందేశం ఇవ్వాలని ఆశిస్తున్నానని తెలిపారు. ప్రభుత్వం వైపు నుంచి, విపక్షాల వైపు నుంచి నీట్ పరీక్ష గురించి విద్యార్థులకు తెలియజేస్తామని రాహుల్ అన్నారు. నీట్‌పై ప్రత్యేక చర్చ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
అందుకు స్పీకర్ ఓం బిర్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం చేపట్టడానికి ముందు ఎటువంటి వాయిదా తీర్మానాలను స్వీకరించరు అని తెలిపారు. కానీ విపక్ష ఎంపీలు మాత్రం తమ పట్టువీడలేదు. నీట్‌పై చర్చ చేపట్టాలంటూ నినాదాలు చేయడంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో సభను 12 గంటల వరకు స్పీకర్ వాయిదా వేశారు. ఆ తర్వాత తిరిగి సభ ప్రారంభమైనప్పటికీ ఎలాంటి మార్పూ లేదు. ప్రతిపక్షాల నిరసనల నేపథ్యంలో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు.
మరోవైపు ఎగువ సభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రాజ్యసభలో నీట్ అంశంపై చర్చకు విపక్షాలు పట్టుబడుతూ నినాదాలు చేశారు. పేపర్ లీకేజీపై ఖర్గే ఆరోపణలు చేశారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. ఈ నేపథ్యంలో చైర్మెన్ జగదీప్ ధన్కర్ సభను 12 గంటల వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత సభ ప్రారంభమైనప్పటికీ విపక్ష సభ్యులు ఆందోళన కొనసాగించాయి. అయినప్పటికీ చైర్మన్ ధన్కర్ సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చను చేపట్టారు. సభ్యులు ఆందోళన కొనసాగిస్తుండటంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.
Also Read..
IndiGo | విమానం వాష్‌రూమ్‌లో పొగతాగి.. కటకటాలపాలైన ప్రయాణికుడు
Sudha Murty | స్త్రీ, పురుషులు సమానమే.. కానీ : సుధామూర్తి
Hemant Soren | హేమంత్ సోరెన్‌కు భారీ ఊరట.. బెయిల్ మంజూరు చేసిన జార్ఖండ్ హైకోర్టు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

