IndiGo | విమానం వాష్‌రూమ్‌లో పొగతాగి.. కటకటాలపాలైన ప్రయాణికుడు
IndiGo | ఓ వ్యక్తి విమానం వాష్‌రూమ్‌లో సిగరెట్ తాగి (man smokes on flight) ఇప్పుడు కటకటాల పాలయ్యాడు.
IndiGo | విమాన ప్రయాణంలో చోటు చేసుకునే కొన్ని ఘటనలు ప్రముఖంగా వార్తల్లో నిలుస్తుంటాయి. ముఖ్యంగా ప్రయాణికుల ప్రవర్తన చర్చకు దారితీస్తుంటుంది. కొందరు వ్యక్తులు విమాన ప్రయాణంలో ఏవి చేయకూడదో అవే చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి విమానం వాష్‌రూమ్‌లో సిగరెట్ తాగి (man smokes on flight) ఇప్పుడు కటకటాల పాలయ్యాడు.
ఈనెల 26వ తేదీన సాయంత్రం 5.15 గంటలకు ఇండిగో (IndiGo) విమానం 176 మంది ప్రయాణికులతో ఢిల్లీ విమానాశ్రయం నుంచి ముంబై బయల్దేరింది. విమానం ముంబై ఎయిర్‌పోర్ట్‌లో దిగడానికి 50 నిమిషాల ముందు ఉత్తరప్రదేశ్‌కు చెందిన 36 ఏళ్ల ఖలీజ్ కాజమ్ముల్ ఖాన్ అనే ప్రయాణికుడు (Passenger) టాయిలెట్‌కు వెళ్లాడు. అతడు వాష్‌రూమ్‌లో సిగరెట్ తాగాడు. స్మోక్ సెన్సార్ల ద్వారా అప్రమత్తమైన క్యాబిన్ సిబ్బంది ప్రయాణికుడు టాయిలెట్ నుంచి బయటకు రాగానే తనిఖీ చేశారు. అక్కడ ఓ అగ్గిపుల్ల, సిగరెట్ స్టబ్ కనిపించింది.
దీంతో విమాన సిబ్బంది వెంటనే ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం సదరు ప్రయాణికుడిని ప్రశ్నించగా.. లావేటరీలో ( lavatory) పొగతాగినట్లు ఖాన్ అంగీకరించాడు. దీంతో ముంబై ఎయిర్‌పోర్ట్‌లో విమానం ల్యాండ్ కాగానే అతడిని సహర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విమాన సిబ్బంది ఫిర్యాదుతో అతడిపై పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్, ఎయిర్ క్రాఫ్ట్ రూల్స్ కింద కేసులు బుక్ చేసి అరెస్ట్ చేశారు.
Also Read..
Hina Khan | స్టేజ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న హీనా ఖాన్.. ఇన్‌స్టాలో పోస్ట్
Vijay Thalapathy | హీరో విజయ్ మంచి మనసు.. పది, ఇంటర్ టాపర్లకు సన్మానం.. వీడియో
Sudha Murty | స్త్రీ, పురుషులు సమానమే.. కానీ : సుధామూర్తి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

