Vijay Thalapathy | హీరో విజయ్ మంచి మనసు.. పది, ఇంటర్ టాపర్లకు సన్మానం.. వీడియో
Vijay Thalapathy | ఈ ఏడాది తమిళనాడులో 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులను తమిళ స్టార్ దళపతి విజయ్ ( Thalapathi Vijay) సన్మానించారు.
Vijay Thalapathy | ఈ ఏడాది తమిళనాడులో 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులను తమిళ స్టార్ దళపతి విజయ్ ( Thalapathi Vijay) సన్మానించారు. తమిళనాడు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి చెందిన ముగ్గురు 10వ తరగతి టాపర్లు, ముగ్గురు ఇంటర్మీడియట్ టాపర్లకు విజయ్ సన్మానం చేశారు. తమిళనాడు రాజధాని చెన్నైలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో ఈ సన్మాన కార్యక్రమం జరిగింది. రాష్ట్రంలోని నియోజకవర్గాల వారీగా టెన్త్, ఇంటర్ (10th and 12th toppers) టాప్ 3లో నిలిచిన విద్యార్థులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి వారిని సన్మానించారు (felicitates the top three toppers). అదేవిధంగా వారికి సర్టిఫికెట్‌తోపాటు రివార్డులను కూడా అందజేశారు.
విజయ్ సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటారు. రాష్ట్రంలోని తన అభిమాన సంఘాల ద్వారా సమాజానికి సేవ చేస్తుంటారు. వదర బాధితులకు, కష్టాల్లో ఉన్న వారికి తనవంతు సాయం చేయడంలో ముందుంటారు. అదే సమయంలో విద్యార్థులకు సాయం చేయడంలో కూడా విజయ్ ఏ మాత్రం వెనుకాడరు. వారిని ప్రోత్సహించేందుకు ఖరీదైన బహుమతులు కూడా ఇస్తుంటారు. గతేడాది ఇంటర్లో మంచి మార్కులు తెచ్చుకున్న ఓ విద్యార్థినికి విజయ్ ఏకంగా డైమండ్ నెక్లెస్‌ను కానుకగా ఇచ్చిన సంగతి తెలిసిందే. అదేవిధంగా తమిళనాడు రాష్ట్రంలో మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు పై చదువుల కోసం తనవంతుగా ఆర్థిక సాయం అందించారు. ఇప్పుడు మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు.
#WATCH | Tamil Nadu: Actor Vijay felicitates the top three toppers of Class 10 and 12 board examinations of the state, in Chennai pic.twitter.com/dS2aAeoojO
— ANI (@ANI) June 28, 2024
ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘గోట్’ చిత్రంలో నటిస్తున్నారు. సురేశ్ ప్రభు డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, అజ్మల్ అమీర్, వైభవ్, లైలా, మోహన్, అరవింద్ ఆకాష్, అజయ్ రాజ్ నటిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ విజయదశమి కానుకగా సెప్టెంబర్ 5, 2024న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాల్లో ఓ వెలుగు వెలుగుతున్న ఈ స్టార్ ఇటీవలే ఓ రాజకీయ పార్టీని కూడా నెలక్పొలాడు. ‘తమిళగ వెట్రి కళగం’ (Tamizhaga Vetri Kazhagam) పేరుతో పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే.
Also Read..
Emergency | ఎమర్జెన్సీ విధింపు అప్రజాస్వామికం కావొచ్చేమో కానీ, రాజ్యంగ విరుద్ధం కాదు : శశిథరూర్
Delhi Rain | ఢిల్లీలో భారీ వర్షం.. 1936 తర్వాత జూన్ నెలలో అత్యధిక వర్షపాతం
Delhi airport | టెర్మినల్ 1ను పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మెహన్ నాయుడు.. మృతులకు నష్టపరిహారం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

